:: Welcome to NRI - Article ::

పొగరాయుళ్లకు షాకింగ్ న్యూస్..

న్యూయార్క్:పొగతాగడం ఆరోగ్యానికి హానికరం... అని ముఖంపై రాసి ఉన్నా సిగరెట్లను తాగడం ఆపడం లేదని న్యూయార్క్ మేయర్‌కు కోపం వచ్చింది. సిగరెట్ పెట్టెల ధరలను కొండెక్కేలా చేస్తే కానీ లక్ష్యం నెరవేరదనుకున్నారో ఏమో కానీ.. పొగరాయుళ్లకు సిగరెట్ తాగకుండానే ధరల సెగ తగిలించారు. ప్రస్తుతం 10.50 డాలర్లు (678 రూపాయలు) ఉన్న సిగరెట్ పెట్టె ధరను... ఒక్కసారిగా 13 డాలర్లకు (840 రూపాయలు) పెంచుతూ మేయర్ బిల్ డె బ్లాసియో నిర్ణయం తీసుకున్నారు. 2020 నాటికి పొగాకు వినియోగాన్ని తగ్గించడమే తన థ్యేయమని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. లక్షా 60 వేల మందికి పొగరాయుళ్ల సంఖ్యను తగ్గించి అమెరికాలోనే అగ్రస్థానాన్ని అందుకుంటామన్నారు. వచ్చే నెల మొదటి వారం నుంచి ఈ ధరలు అమలవుతాయన్నారు. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో సిగరెట్ పెట్టె ధర ఎక్కువగా ఉన్న ఏకైక రాష్ట్రంగా న్యూయార్క్‌ రికార్డు సృష్టించింది.

 

Loading...