:: Welcome to NRI - Article ::

స్మోక్ డిటెక్టర్‌లో హిడెన్ కెమెరా

ఫ్లోరిడా: భార్యభర్తలిద్దరూ ఒక హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు. పని మీద వారు ఫ్లోరిడాలోని తాంపాబే కంట్రీకి వచ్చారు. ఫ్లోరిడాలోని ఎయిర్నింబా ప్రాంతంలోని ఒక హోటల్‌కు ఆ భార్యభర్తలు వెళ్లారు. అయితే వారు అద్దెకు తీసుకున్న గదిలో ఒక స్మోక్ డిటెక్టర్ కనిపించింది. ముందు వారు దాన్ని పెద్దగా పరిశీలించలేదు. కొద్దిసేపటి తర్వాత  స్మోక్ డిటెక్టర్‌ను ఉపయోగించేందుకు భార్య దాన్ని చేతుల్లోకి తీసుకుంది.

ఆ స్మోక్ డిటెక్టర్‌కున్న హోల్‌లో ఏదో నల్లటి వస్తువును ఆమె గమనించింది. వెంటనే దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించింది. కానీ, ఆమె వల్ల కాలేదు. దాంతో భర్తకు ఆ విషయం చెప్పింది. భర్త దాన్ని పరిశీలించి అది హిడెన్ కెమెరా అని గుర్తించాడు. దాన్ని బయటకు తీసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కెమెరాలో 40 మంది భార్య భర్తల అశ్లీల వీడియోలు ఉన్నాయని పోలీసులు తేల్చారు. ఆ హోటల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.