helicopter-crash--five-men-died-

ఘోర ప్రమాదం.. నదిలో కుప్పకూలిన హెలికాప్టర్..

న్యూయార్క్: న్యూజెర్సీ నుంచి న్యూయార్క్ బయలుదేరిన హెలికాప్టర్ కొద్ది గంటల్లోనే నదిలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అయిదుగురు వ్యక్తులు మరణించారని అధికారులు తెలిపారు. పైలెట్ మాత్రం తప్పించుకున్నాడని వారు చెప్పారు. ఇంజన్ ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగిందని అధికారులంటున్నారు. ఆదివారం సాయంత్రం గం.7లకు న్యూయార్క్ చేరుకున్న హెలికాప్టర్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మీదుగా ప్రయాణిస్తోందని వారు చెప్పారు. అయితే ఇంజన్ పనిచేయని కారణంగా ఒక్కసారిగా నదిలో కూలిపోయిందని వారు చెప్పారు. ప్రయాణికులు సీటు బెల్ట్‌లు పెట్టుకుని ఉండటం వల్ల తొందరగా తప్పించుకోలేకపోయారు. అలాగే ఒకవేళ తప్పించుకోగలిగిన ఈత రాకపోవడం వల్ల కూడా నదిలో మునిగి చనిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన కొద్ది క్షణాలకే రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించిందని అధికారులు చెప్పారు. అయితే ఓ ఫోటో షూట్ నిర్వహించేందుకు హెలికాప్టర్‌ను ఉఫయోగించినట్లు అధికారులు భావిస్తున్నారు. ఆ ఫోటో షూట్‌లో భాగంగానే హెలికాప్టర్‌ నదిలో కూలిన సమయంలో ఫోటోలు, వీడియోలు తీయగలిగారని అధికారులు చెప్పారు. హెలికాప్టర్ కూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.