heavy-traffic-jam-

రోడ్లపై ఎటు చూసినా వాహనాలే కనిపించాయని..

ఫ్లోరిడా: ఎటు చూసినా రోడ్లపై వాహనాలు కనిపిస్తున్నాయి. మొత్త 70 లక్షల మంది ఇళ్లు, వాకిలి వదిలి వెళ్లిపోతున్నారు. తినడానికి తిండి కూడా సరిగ్గా లేక అష్టకష్టాలు పడుతూ ప్రాణాలు దక్కించుకునేందుకు ప్రజలు తాపత్రయపడ్డారు. ఈ దృశ్యాలు గతేడాది ఫ్లోరిడాలో కనిపించాయని అధికారులు గుర్తు చేసుకున్నారు. ఏడాది క్రితం ఇర్మా తుఫాన్ సృష్టించిన బీభత్సం అంత ఇంత కాదని వారు అభిప్రాయపడ్డారు.

ఇర్మా తుఫాన్ కారణంగా అప్పట్లో ప్రజలు ఇళ్లు వదిలివెళ్లాల్సి వచ్చిందన్నారు. రోడ్లపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో పెట్రోల్, గ్యాస్ స్టేషన్‌లలో ఇంధనం కొరత ఏర్పడిందన్నారు. కొన్ని సందర్భాల్లో ప్రజలు రాత్రంతా గ్యాస్ స్టేషన్‌లలోనే పడుకుని మర్నాడు ఇంధనం వాహనాల్లో నింపుకుని ప్రయాణాలు కొనసాగించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.