heavy-snowfall-in-america-

భారీగా మంచు కురుస్తుడటంతో..

న్యూజెర్సీ: లక్ష ఇరవై వేల మంది ప్రజలు రాత్రయితే అంధకారంలో ఉంటున్నారు. ఇప్పట్లో ఆ ప్రాంతాల్లో కరెంటు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని అధికారులు చెప్పారు. మంచు తుఫాన్‌ వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అలాగే శుక్రవారం సాయంత్రం హైవే నంబరు 94పై తీవ్ర ప్రమాదం జరిగింది. అరవై వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయని అధికారులు చెప్పారు. అయితే ప్రమాదానికి కారణం రోడ్డుపై పేరుకుపోయిన మంచునేనని అధికారులు తేల్చారు. ఆ ప్రమాదంలో చాలా మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు. ఇదిలావుండగా కరెంటు సరఫరా నిలిచిపోవడంతో నీటి సమస్యలు మొదలయ్యాయన్నారు. మంచినీళ్లు కూడా దొరకడం లేదని స్థానికులు చెబుతున్నారు. మంచు వల్ల వాతావరణం ఒక్కసారిగా మారిపోవడం వల్ల నీళ్లు పైపుల్లో గడ్డ కట్టాయన్నారు.