heavy-snowfall-

భారీ మంచు తుఫాన్.. రెండు అడుగుల మేర మంచు పేరుకుపోయి..

మిచిగాన్(అమెరికా): భారీ మంచు తుఫాన్ కురిసి రోడ్లపై ఎటు చూసిన మంచు పేరుకునిపోయింది. దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అధికారులు తెలిపారు. దాదాపు రెండు అడుగుల మేర మంచు రోడ్లపై పేరుకుపోవడంతో వాహనాలు నడిచే పరిస్థితులు కనిపించలేదని వారు చెప్పారు. చాలా చోట్ల యజమానులు తమ వాహనాలను అక్కడే వదిలి వెళ్లిపోయారన్నారు. కొన్ని చోట్ల యాక్సిడెంట్లు కూడా జరిగియని అధికారులు తెలిపారు. ఇళ్ల ముందు భారీగా మంచు కురవడంతో ప్రజలు తొలగించే పనిలో పడ్డారన్నారు.

అయితే మంచు కురియడం వల్ల ఎన్నో రోజు వారి పనులకు ఆటంకాలు ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలు ఇతర వ్యాపార సమూదాయాలను మూసివేయాల్సిన పరిస్థితులు తలెత్తాయన్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాలను సైతం రద్దు చేశారన్నారు. మొత్తం 270 విమాన సర్వీసులు అధికారికంగా రద్దు చేశారని అధికారులు తెలిపారు.