:: Welcome to NRI - Article ::

పెళ్లి కూతురిని చూసి విలపించిన పెళ్లి కొడుకు..

డాండ్రిడ్జ్, టెన్నీసే: మరికొద్ది నిమిషాల్లో పెళ్లి.. ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి. తాను చేసుకోబోయే అమ్మాయి రాకకోసం పెళ్లి కొడుకు ఎదురుచూస్తున్నాడు. ఎదురుచూస్తున్న క్షణాలు రానేవచ్చాయి. పెళ్లి కూతురు వేదిక వద్దకు వచ్చింది. ఇంకేముంది పెళ్లి కొడుకు సంతోషంగా ఉంటాడులే అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే పెళ్లి కూతురిని చూసిన అతడు బోరున విలపించాడు. వెక్కివెక్కి మరీ ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడో తెలుసుకోవాలనుకుంటున్నారా?..

పూర్తివివరాలలోకి వెళ్తే.. మికా బేకర్ అనే 22 ఏళ్ల యువకుడు తనకు ఇష్టమైన, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 22 ఏళ్ల యువతి బెయిలీని ఆగస్టు 5న పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన ఓ విషయం వెలుగులోకి వచ్చింది. పెళ్లి కూతురి దుస్తుల్లో వస్తున్న యువతిని చూసిన యువకుడు బోరున విలపించాడు. ఎంతమంది చూస్తున్నా, ఎవరు చెప్పినా వినిపించుకోకుండా ఏడ్చాడు. కొద్దిసేపటి తర్వాత కుదుటపడడంతో పెళ్లి సజావుగా సాగింది. పెళ్లి అనంతరం ఎందుకు ఏడ్చాడో పెళ్లి కొడుకు వివరించాడు.  ఆమెను పెళ్లి చేసుకోవాలని ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నానని, సుధీర్ఘ నిరీక్షణ అనంతరం పెళ్లి దుస్తుల్లో ఆమెను చూడడంతో దు:ఖాన్ని అదుపు చేసుకోలేకపోయానని తెలిపాడు. పెళ్లి కొడుకు ఏడ్పును పెళ్లి కూతురి చెల్లెలు కెమేరాలో బంధించింది. సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఫోటోలు వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలపై పలువురు పలువిధాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. అమెరికాలోని టెన్నీసే రాష్ట్రంలో ఈ పెళ్లి జరిగింది.

 

Loading...