governor-issues-state-of-emergencies

ఉపద్రవం ముంచుకొస్తోంది..జాగ్రత్త: గవర్నర్

లూసియానా, యూఎస్ఏ: యూఎస్ గల్ఫ్ కోస్ట్‌లో ఏర్పడిన ఉష్ణమండల తుఫాను ‘గొర్డన్’ పలు రాష్ట్రాల తీర ప్రాంత ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఉష్ణమండల తఫాను హారికేన్‌గా మారకపోయినప్పటికీ ప్రభావం అధికంగానే ఉంటుందని వాతావరణశాఖా అధికారులు అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలో లూసియానా గవర్నర్ జాన్ బెల్ ఎడ్వర్డ్స్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రమాదమని అంచనావేసిన ప్రాంతాల్లో భద్రతా దళాలను ముందస్తుగా మోహరించారు. తీర ప్రాంతవాసులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. సోమవారం నాటికి ఫ్లోరిడా కీస్, సౌత్ ఫ్లోరిడాకు సమీపంలో తుఫాను కేంద్రీకృతమైందని, మంగళవారం నాటికి లూసియానా, మిస్సిసిపీ వైపుగా కదలవచ్చునని వాతావరణ శాఖా అధికారులు హెచ్చరించారు. దాదాపు 20 సెం.మీ. మేర వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని హెచ్చరించారు. తీరప్రాంతవాసులతోపాటు తీరాల్లో రిగ్స్‌లో పనిచేసేవారు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, కనీస అవసరాలైన వస్తువులను భ్రదపరచుకోవాలని సూచించారు.