Florida-will-get-rain-

రానున్న అయిదు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని..

ఫ్లోరిడా: తుఫాన్ ఫ్లోరిడాను ముంచెత్తనుందని అధికారులు చెబుతున్నారు. రానున్న అయిదు రోజుల్లోనే ఫ్లోరిడా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నేషనల్ హరికేన్ సెంటర్ అధికారులు ప్రకటించారు. వాయవ్య ఫ్లోరిడా తీరం మీదుగా బలమైన గాలులు వీస్తున్నాయని కొద్దిరోజుల్లోనే అవి వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. కచ్చితంగా వాయుగుండం ఏర్పడుతుందని  అధికారులు చెబుతున్నారు. ఏర్పడే వాయుగుండం మెల్లగా ఫ్లోరిడావైపు కదిలే అవకాశముందని వారు చెప్పారు. మంగళవారం నాటికే వాయుగుండం బలపడే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఆ వాయుగుండం ప్రభావం కారణంగా 2 నుంచి 4 సెం.మీ.ల వర్షపాతం కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో కూడా ఫ్లోరిడాను తుఫాన్‌లు ముంచెత్తాయని అధికారులు గుర్తుచేస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా ప్రాణనష్టం జరగకుండా రెస్క్యూటీంను రంగంలోకి దించామని వారు చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.