:: Welcome to NRI - Article ::

రాటిల్ స్నేక్ ఏ భాగంలో కరచిందో తెలుసా?

ఫ్లోరిడా: విషపూరితమైన పాముల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పాము కాటుతో ప్రతి ఏడాది చనిపోతున్న వారి సంఖ్య గణనీయంగానే ఉంటోంది. కరచిన పాము విషం తీవ్రత, మనిషిని పాము ఏ భాగంలో కరచింది అనే అంశాలను బట్టి మనిషి ఎంత త్వరగా చనిపోతాడని నిర్ధారించవచ్చు. అయితే అమెరికాలోని ఫ్లోరిడా నగరానికి చెందిన ఓ వ్యక్తిని రాటిల్ స్కేక్ కరచింది. అత్యంత విషపూరితమైన రాటిల్ స్నేక్ బాధితుడిని అనూహ్యంగా నాలుకపై కరవడంతో అతడి పరిస్థితి తీవ్ర విషమంగా మారింది. దీంతో ఓ హెలీకాఫ్టర్‌లో హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.