:: Welcome to NRI - Article ::

ఫ్లోరిడాలో ఇర్మా తుఫాన్ ప్రళయం( వీడియో)

ఫ్లోరిడా: ప్రకృతి కన్నెర చేస్తే ఎవ్వరైనా తల వంచాల్సిందే. దాని ధాటికి వణకాల్సిందే ప్రస్తుతం అమెరికా పరిస్థితి అచ్చంగా ఇలాగే తయారయింది. 10 వేల మంది నిత్యం చిమ్మచీకట్లోనే కాలం వెల్లదీస్తున్నారు. అత్యవసర సమయాల్లో ఫోన్ చేద్దామంటే ప్రజలకు ఫోన్ సౌకర్యం కూడా అందుబాటులో లేదు. దేశంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఫ్లోరిడాలో నెలకొంది. 'ప్రజలను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది' అంటూ ఫ్లోరిడా గవర్నర్ రిక్ స్కాట్ ట్వీట్టర్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం ప్రళాయాన్ని మనమంతా దగ్గరగా చూశామని ఆయన తెలిపారు. అంత పెద్ద ప్రమాదం నుంచి మనమంతా బయటపడటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు.

ప్రజలు కూడా ఎంతో దైర్యంతో అంత పెద్ద ప్రయళాయాన్ని ఎదుర్కొన్నారని అభినందించారు. ఎవ్వరైతే తమ ఇళ్లను వదిలి రాలేదో వారు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం సూచించిన సమయంలో ఇళ్లను వదిలి వసతి గృహాల్లోకి వచ్చిన వారు ప్రస్తుతం ఎంతో భద్రంగా ఉన్నారని ఆయన అంటున్నారు. ముఖ్యంగా ద్వీప ప్రాంతాల్లో ఉంటున్నవారిలో 79 వేల మంది మళ్లీ ఇళ్లకు వెళ్లిపోయారని ఇర్మా తుఫాన్ ప్రస్తుతానికి శాంతించిందని ఆయన తెలిపారు. ఫ్లోరిడాలో ఇర్మా తుఫాన్ సమయంలో నెలకొన్న పరిస్థితులను ప్రపంచానికి చూపించే ఒక వీడియోను ఫ్లోరిడా విపత్తు నివారణ శాఖ విడుదల చేసింది.