Florida-city-commissioner-resigns-over-accusations-she-licked-men's-faces

సహోద్యోగులతో అసభ్య ప్రవర్తన..ఉన్నతోద్యోగి రాజీనామా

మధీరా:సహోద్యోగులతో అసభ్యంగా ప్రవర్తించిందనే ఫిర్యాదులు రావడంతో మధీరా బీచ్ సిటీ కమిషనర్ నాన్సీ ఓక్లే తన పదవికి రాజీనామా చేశారు. తాను ఎక్కడా విలువలను కోల్పోలేదని..తనపై వచ్చిన వివాదం ఇంకా కొనసాగుతుండటంతోనే పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ‘నా నిజాయితీని కాపాడుకున్నా..న్యాయ మార్గాన్ని కొనసాగిస్తా’ అంటూ ఆమె తెలిపారు. ఇంతకూ ఆమెపై ఏం ఫిర్యాదులు వచ్చాయంటే..

2012లో జరిగిన ఓ ఫిషింగ్ టోర్నమెంట్‌లో నాన్సీ తమతో అసభ్యంగా ప్రవర్తించిందని మధీరా బీచ్ సిటీ మాజీ మేనేజర్ షేన్ క్రెఫోర్డ్, బీచ్ సిటీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ డేవ్ మార్సికనో ఫ్లొరిడా కమిషన్ ఆఫ్ ఎథిక్స్‌కు ఫిర్యాదు చేశారు. వారిచ్చిన ఫిర్యాదు ప్రకారం..టోర్నమెంట్ సమయంలో మత్తులో ఉన్న నాన్సీ షేన్ క్రెఫోర్డ్ వద్దకు వచ్చి..ఆయన మర్మాంగాన్ని పట్టుకోడమే కాకుండా మొహంపై ముద్దులు పెట్టింది. అంతేకాకుండా తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మెక్‌గ్రాండీపై నిందలు వేస్తూ తనను ఇంకోసారి వెంట తీసుకురావద్దంటూ నానా రాద్దాంతం చేసింది. ఆ తరువాత క్రఫోల్డ్, మెక్‌గ్రాండీ వివాహం చేసుకోవడం విశేషం. తనపై అసూయతోనే నాన్సీ అలా ప్రవర్తించిందని మెక్‌గ్రాండీ ఆరోపించింది. మరోపక్క వారిద్దరి మధ్య రహస్య సంబంధం ఉన్నందునే నాన్సీ వారితో అలా ప్రవర్తించి ఉండవచ్చని ఎథిక్స్ కమిషన్ తెలుపగా..వాటిని క్రెఫోల్డ్, మెక్‌గ్రాండీ ఖండించారు. తన కంటే పైస్థాయిలో ఉన్న వ్యక్తిపై ఫిర్యాదు చేసి ఆమెకు శత్రువుగా మారడం ఇష్టంలేకే ఆ సమయంలో నిశ్శబ్దంగా ఉన్నానని..కానీ ఆమె రెండోసారి కూడా కమిషనర్‌గా ఎన్నికయ్యాక ఫిర్యాదు చేసినట్టు క్రెఫోల్డ్ తెలిపారు. 

క్రెఫోల్డ్‌కు ఎదురైన సంఘటనే తనకు కూడా ఎదురైనట్టు డేవ్ మార్సికానో ఫిర్యాదులో తెలిపారు. 2012లో జరిగిన ఓ సమావేశంలో నాన్సీ తనతో అసభ్యంగా ప్రవర్తిస్తూ మొహంపై ముద్దులు పెట్టిందని..ఎక్కడెక్కడో చేతులు పెట్టి తాకిందని ఆరోపించారు. ఆ సమయంలో తన భార్య నాన్సీతో వాగ్వాదానికి కూడా దిగినట్టు మార్సికానో తెలిపారు. అయితే ఆమెపై ఫిర్యాదు చేస్తే..తన ఉద్యోగం పోతుందేమోనన్న భయంతో ఆ సమయంలో స్థబ్దంగా ఉండిపోయానని మార్సికానో చెప్పారు. కాగా, జనవరి 25న జరిగిన సమావేశంలో.. నాన్సీ పదవీ దుర్వినియోగానికి పాల్పడినట్టు ఫ్లొరిడా కమిషన్ ఆఫ్ ఎథిక్స్  ప్రకటించింది. నాన్సీకి ఐదు వేల డాలర్ల జరిమానాను విధించి, బహిరంగంగా గవర్నర్‌చేత ఆమెను బాధ్యతల నుంచి తప్పించాలని ఓ అధికారి కోరారు. కాగా, నాన్సీ రాజీనామాను బోర్డు సభ్యులు ఆమోదించినట్టు అధికారులు తెలిపారు. నాన్సీ 2007 నుంచి 2011 వరకు మధీరా బీజ్ సిటీ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం 2017లో మరోమారు ఆమె ఆ పదవిని చేపట్టారు. మార్చిలో ఆమె స్థానానికి ఎన్నికలు జరిగుతుండటంతో..ప్రస్తుతం ఆ పదవి ఖాళీగానే ఉండనుంది.