:: Welcome to NRI - Article ::

అమెరికాలో అగ్నిప్రమాదం..

కాలిఫోర్నియా: ప్రపంచం ఎంత టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతున్న కొన్ని ప్రమాదాలను నిరోధించడంలో మాత్రం ఎప్పుడు వెనుకబడుతోంది. అలాంటి ప్రమాదాల్లో అగ్ని ప్రమాదాలు కూడా ఒకటి. ఉత్తర కాలిఫోర్నియాలో ఆదివారం మొదలైన కార్చిచ్చు మంగళవారం వరకు రగులుతునే ఉంది. అగ్నిమాపక సిబ్బంది ఎంతో కష్టపడిన తర్వాత బుధవారం శాంతించింది. లక్ష పదిహేను వేల ఎకరాల అటవీ ప్రాంతాన్ని బూడిద చేసిన అగ్నిప్రమాదమని అధికారులు చెప్పారు.

మొత్తం 17 మంది ఈ ప్రమాదంలో చనిపోయారని వారన్నారు. అలాగే సుమారు 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. సానోమా, యుబా కంట్రీలోని చాలా ప్రాంతాల్లో పట్టణాల్లో కార్లు, ఇళ్లు కాలిబూడిదయ్యాయని వారు తెలిపారు. ఇళ్లు గుర్తుపట్టేనంతగా మారిపోయాయంటున్నారు.