fatally-shooting-his-brother

సొంత అన్నయ్యనే కాల్చి చంపేసి..

టెక్సాస్: అమెరికాలో విస్తరించిన తుపాకీ సంస్కృతికి ఈ సంఘటనే నిదర్శనం. ఇద్దరు యువకుల మధ్య మొదలైన ఘర్షణ చివరికి ఒకరి ప్రాణాలు బలిగొంది. అయితే ఘర్షణ పడిన ఇద్దరు యువకులు స్వయాన అన్నదమ్ములే కావడం విశేషం. గోలిండా కంట్రీలో శనివారం సాయంత్రం ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. మైకెల్(17), లూకాస్(21) అనే అన్నదమ్ముల మధ్య ఓ విషయంలో వివాదం చెలరేగిందని స్థానికులు తెలిపారు. అయితే వారి మధ్య చిన్నగా మొదలైన గొడవ చివరికి ప్రాణాలు తీసుకునే వరకు వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. కోపంతో తమ్ముడు మైకెల్ తన అన్నయ్య లూకాస్‌ను తుపాకీతో కాల్చి చంపేశాడని వారు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించామని స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునేలోగానే లూకాస్ చనిపోయాడని స్థానికులు తెలిపారు.