terrifying-surveillance-video

వీడియో చూస్తే భయపడతారు

డెన్వర్, కొలరాడో: ప్రమాదం ఏ రూపంలోనైనా ముంచుకొస్తుంది. ప్రాణాలు మిగులుతాయా.. లేదా.. అనేది వ్యక్తుల తలరాతపై ఆధారపడి ఉంటుంది. ఇదేకోవకు చెందిన గుండె వేగాన్ని పెంచే ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని కొలరాడోకు చెందిన శాం హైనెస్ అనే వ్యక్తి మార్చి 2017లో స్థానిక రీజినల్ ట్రాన్స్‌పోర్టేషన్ డిస్ట్రిక్ట్(ఆర్టీడీ) రైళ్లో ప్రయాణిస్తూ అరారియా స్టేషన్‌లో దిగుదామనుకున్నాడు. ఈ ప్రయత్నంలో రైలు డోర్‌లో ఇరుక్కుపోయిన తన బైక్‌ను తీసేందుకు ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తూ రైళ్లో నుంచి జారిపడ్డాడు. ఫ్లాట్‌ఫాం, రైలు మధ్య పడ్డాడు. దీంతో వేగంగా వెళ్తున్న ట్రైన్ అతడిని కొద్దిదూరం ఈడ్చుకెళ్లింది. వీల్‌చైర్ రాంప్‌ అడ్డుపడడంతో ఆగిపోయాడు. ట్రైన్ వెళ్లిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమేరాలో రికార్డయ్యాయి. హైనెస్‌కు చెయ్యి, ఒక పక్కటెముక విరిగాయి. హాస్పిటల్లో చికిత్స తర్వాత కోలుకున్న బాధితుడు అతడు తన మెడికల్ బిల్లులను ఆర్టీడీ భరించాలని కోరుతున్నాడు. ఈర్టీడీ లైట్-రైల్ సిస్టమే తన పరిస్థితికి కారణమంటూ కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. విచారణ జరపనున్న కోర్టు ఈ కేసుపై ఏం తీర్పు చెపుతుందో వేచిచూడాలి. ఆర్ఏడబ్లూ సహకారంతో మీరు కూడా వీడియో చూడండి.