Elephant-holds-up-morning-exercise

రోడ్డుపై ఏనుగు ఏం చేస్తుందో వీడియో చూస్తే..

సౌత్ కరోలినా: మూగ జీవాల ప్రవర్తన అప్పుడప్పుడు ఆసక్తికరం, వింతగా అనిపిస్తుంది. వీక్షకులకు ఆశ్చర్యంతోపాటు కొత్త అనుభూతికి గురిచేస్తుంది. ఇదేకోవకు చెందిన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డు దాటుతున్న ఓ ఏనుగు రోడ్డు చివరన ఆగింది. అకస్మాత్తుగా ‘ఎక్సర్‌సైజ్’ చేయడం మొదలుపెట్టింది. ఎక్సర్‌సైజ్ చేస్తున్నట్లుగానే కాళ్లను వెనుకకు ముందుకూ కదిపింది. రోడ్డుపై ఏనుగు చేస్తున్న ఈ విన్యాసాలను చూసిన వాహనదారుల భయంతో తమ కార్లను రోడ్డుపైనే నిలిపారు. ఏనుగు అక్కడి నుంచి వెళ్లిపోయేంత వరకూ అలాగే వేచిచూశారు. ఏనుగు అక్కడి నుంచి వెళ్లిన తర్వాత మాత్రమే కదిలారు. అమెరికాలోని సౌత్ కరోలినాలో ఉన్న క్రూజర్ నేషనల్ పార్క్‌లో జరిగిన ఈ దృశ్యాన్ని వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీకి చెందిన మిచెల్లీ బ్రాడ్‌హర్ట్స్(49), జాక్వెస్ జోబెర్ట్(55) చిత్రీకరించారు. ఏనుగు ఎక్సర్‌సైజ్ చేయడం ఏంటీ అనుకుంటున్నారా... అయితే మెయిల్ ఆన్‌లైన్ వారి సౌజన్యంతో ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..