eggs-became-chicken-

కోడిగుడ్లు పారేస్తే.. కోడిపిల్లలై వచ్చాయి..

జార్జియా: అదో డంపింగ్ యార్డ్. అక్కడ పనికిరాని చెత్త తప్ప.. పనికొచ్చేది ఒక్కటీ లేదు. చుట్టూ నిర్మానుష్యం. అలాంటి స్థలం నుంచి ఒక్కసారి వందలాది కోడిపిల్లలు పరుగెత్తుకుంటూ వచ్చేశాయి. వీటిని చూసిన స్థానికులు షాక్ అయ్యారు. ఇంతపెద్ద మొత్తంలో కోడిపిల్లలు ఎక్కడి నుంచి వస్తున్నాయని కంగారుపడ్డారు. ఎటు చూసినా కోడిపిల్లలే దర్శనమిస్తుండడంతో ఏం జరిగిందో అని అందరిలోనూ ఆసక్తి పెరిగింది.

 
ఇంతకీ విషయమేంటంటే.. జార్జియాలోని మార్నెలిలో ఫౌల్ట్రీ రైతులు పాడైపోయాయని భావించి వందలాది కోడిగుడ్లను డంపింగ్ యార్డ్‌లో పారేశారు. డంపింగ్ యార్డ్‌లో ఉష్ణోగ్రత్ర, పగలు సూర్యరశ్మి కారణంగా ఆ గుడ్లు పొదిగి.. వాటిలో నుంచి కోడిపిల్లలు వచ్చాయి. ఇలా వందలాది కోడిపిల్లలు ఒక్కసారిగా డంపింగ్ యార్డ్ ప్రాంతంలో పరుగులు తీశాయి. వీటిని గమనించిన స్థానికులు కొందరు.. కోడిపిల్లలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్‌ అయింది. కాగా, పాడైపోయాయని పారేసిన కోడిగుడ్ల నుంచి కోడిపిల్లలు రావడంతో అక్కడి ప్రజలు ఆశ్చర్యపోయారు. దొరికినవి దొరికనట్లు కోడిపిల్లలను తమ ఇళ్లకు పట్టుకెళ్లారు.