earthquake-in-California-

కాలిఫోర్నియాలో భూకంపం..

కాలిఫోర్నియా: కాలిఫోర్నియా ప్రజలను వరుస విపత్తులు కలవరపెడుతున్నాయి. బుధవారం భూకంపం రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఉదయం గం.4-33నిమిషాలకు భూకంపం సంభవించిందని అధికారులు ప్రకటించారు. భయంతో ప్రజలు ఇళ్లలో నుంచి మైదాన ప్రాంతాలకు పరుగులు తీశారని వారు తెలిపారు. అయితే ఎవ్వరికీ ఎటువంటి హని కలగలేదన్నారు. ఆస్తి నష్టం మాత్రం భారీగానే సంభవించినట్లు వారు చెప్పారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.2గా నమోదైందని అధికారులు తెలిపారు. భూకంపం కేంద్రం 5.6 మైళ్ల(9కి.మీ.) లోతులో ఉందని ఇంతవరకు దక్షిణ కాలిఫోర్నియాలో ఇంత పెద్ద భూకంపం సంభవించలేదని అధికారులు చెబుతున్నారు.