:: Welcome to NRI - Article ::

అందాల పోటీలో విజేతగా నిలిచిన పోలీసు అధికారి

టెక్సాస్: అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే తపన ఉండాలేగానీ మిగతా పనులేవీ అవరోధాలు కాబోవని ఓ పోలీసు అధికారి నిరూపించారు. అమెరికాలోని టెక్సాస్ నగరానికి చెందిన 29 ఏళ్ల యువతి షాన్నోన్ డ్రెసర్ ఓ పోలీసు అధికారిగా పని చేస్తోంది. బాధ్యతాయుతమైన పోలీసు అధికారిగా పని చేస్తున్న ఆమెకు అందంపై  మక్కువ ఎక్కువే. పోలీసు డ్యూటీ చేస్తూనే అందాల పోటీకి సిద్ధమైంది. ఈ క్రమంలో తాను కలలు కన్న అందాల కిరీటాన్ని సొంతం చేసుకుంది.  గతవారం జరిగిన మిస్ టెక్సాస్ యునైటెడ్ స్టేట్స్ పోటీల్లో విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరచింది. దీంతో ఆమె పలువురి మన్ననలను పొందుతోంది. ఇదిలావుండగా గతంలో ఈ పోలీసు అధికారిచే అరెస్టు చేయించుకోవాలని అనేక మంది యువకులు ప్రయత్నించడం గమనార్హం. అబ్బాయిల కలల సుందరిగా నిలిచిన షాన్నోన్ ఇప్పుడు టెక్సాస్ సుందరిగా కూడా రెండు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. దీంతో ఆమె పేరు మారుమోగిపోతోంది. మనుషులలోని నిజమైన కోరికలను బయటపెట్టాలని ఈ సందర్భంగా ఆమె సందేశాన్ని ఇస్తోంది.