donot-eat-those-eggs-

'ఆ కోడిగుడ్లను తినొద్దు'

న్యూయార్క్: దేశవ్యాప్తంగా సుమారు 2కోట్ల కోడిగుడ్ల అమ్మకాలు జరిగాయి. అయితే ఆ కోడిగుడ్లల్లో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. సాల్మొనెల్లా కలిగిన కోడిగుడ్లను తినొద్దంటూ వైద్యులు ప్రకటన చేశారు. ఇప్పటికే ఆ కోడిగుడ్లను తిన్న 22 మంది సాల్మొనెల్లా ప్రభావం కనిపించిందని డ్రగ్స్ అండ్ ఫుడ్ అథారిటీ అధికారులు తెలిపారు. అయితే అమ్మిన కోడిగుడ్లను వెనక్కి తీసుకోవడం జరగని పని అని అధికారులు అభిప్రాయపడ్డారు. వివిధ రాష్ట్రాల్లోని రెస్టారెంట్ల‌లోనూ వాల్ మార్ట్‌లలోనూ ఆ కోడిగుడ్ల విక్రయాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

అయితే మొత్తంగా అన్ని కోడిగుడ్లల్లో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉందని తాము భావించడం లేదని అధికారులు తెలిపారు. ఇండియానాలోని రోజ్ ఏర్స్ ఫామ్స్ నుంచి దిగుమతి అయిన కోడిగుడ్లలో మాత్రమే సాల్మొనెల్లా లక్షణాలు గుర్తించామని అధికారులు చెబుతున్నారు. ఇండియానా ఫామ్స్ నుంచి దిగుమతి అయిన కోడిగుడ్లకు బార్‌కోడ్ ఉందని దాని ఆధారంగా వాటిని గుర్తిస్తున్నామని అధికారులు తెలిపారు. వాటిని వెనక్కి ఇస్తే మనీ రిఫండ్ చేస్తామంటున్నారు. ఇదిలావుండగా సాల్మొనెల్లా బ్యాక్టీరియా తీవ్ర జ్వరానికి కారణమవుతుందని అధికారులు తెలిపారు. జ్వరంతోపాటు వాంతులు కూడా అవుతాయంటున్నారు.