:: Welcome to NRI - Article ::

ఓ డాక్టర్, ఇద్దరు నర్సులు కలిసి 11 మంది బాలికలపై దారుణం

కాలిఫోర్నియా: సమాజంలో గౌరవప్రదమైన వృత్తులు నిర్వర్తిస్తున్న కొందరు వ్యక్తులు దిగజారి ప్రవర్తిస్తున్నారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతూ విలువను దిగజార్చుకుంటున్నారు. ఇదేకోవకు చెందిన దారుణమైన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. డా. జేమ్స్ కోహుట్ ఇతడి వద్ద పనిచేస్తున్న ఇద్దరు నర్సులు ఇమిలి స్టేఫెన్స్, రషేల్ బ్రాండన్ దారుణానికి ఒడిగట్టారు. హాస్పిటల్లో చికిత్సపొందడానికి వచ్చిన బాలికలపై లైంగిక దాడులకు పాల్పడ్డారు. ఇప్పటివరకు 11 మంది బాలికలపై లైంగిక దాడులు చేశారు. నర్సులు బాలికలను బలవంతంగా నగ్నంగా మార్చారు.  అనంతరం నిందితుడు జేమ్స్ కోహుట్ వారిపై దారుణ రీతిలో అత్యాచారాలకు పాల్పడ్డాడు. ఈ దృశ్యాలను సెల్‌ఫోన్లో చిత్రీకరించారు. చిత్రాలను పోర్న్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. ఈ నేరాలు ఇటీవలే వెలుగులోకి రావడంతో నిందితుడు జేమ్స్ కోహుట్ ఆరిజోనా నగరంలో అదుపులోకి తీసుకున్నారు. నర్సులపై కూడా కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలో వెలుగులోకి వచ్చింది. 

Loading...