Dispute-over-price-of-sex-leads-to-murder

మాట్లాడుకున్న దాని కంటే ఎక్కువ అడిగిందని..సెక్స్‌వర్కర్‌ను..

టెక్సాస్: మాట్లాడుకున్న ధర కంటే ఎక్కువ డబ్బులు అడిగిందని..అమెరికాలో ఓ వ్యక్తి సెక్స్‌వర్క‌ర్‌ను కాల్చి చంపాడు. టెక్సాస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వెస్ట్ జాక్సన్ వీధిలో మహిళను ఎవరో హతమార్చినట్టు సమాచారాన్ని అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. చనిపోయిన మహిళ టెక్సాస్‌లోని ఓ బార్‌లో పనిచేస్తున్న కాలిసన్(22)గా పోలీసులు గుర్తించారు. అనంతరం దర్యాప్తులో ఆమె చావుకు కారణం సామ్యూల్ రోజర్స్ అనే వ్యక్తి అని కనిపెట్టిన పోలీసులు అతన్ని బర్నెట్ కౌంటీ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. 600 డాలర్లకు తామిద్దరి మధ్య ఒప్పందం జరిగిందని..అయితే తన దగ్గరకు వచ్చాక వెయ్యి డాలర్లు ఇవ్వాలని..లేకపోతే పోలీసులకు చెబుతానంటూ కాలిసన్ తనను బెదిరించిందని రోజర్స్ పోలీసులకు వివరించాడు. అందుకే కాలిసన్‌ను తుపాకీతో చంపానని రోజర్స్ నేరాన్ని అంగీకరించాడు.