Death-sentence-history-in-pennsylvania

పెన్సిల్వేనియాలో మరణ శిక్షల చరిత్ర

న్యూయార్క్‌: పెన్సిల్వేనియాలో 1693-2002 మధ్యకాలంలో 1043 మందికి మరణ శిక్షలు విధించారు. 1915వరకు ఉరినేమరణదండనకు ఉపయోగించేవారు. విద్యుత్తు కుర్చీపై నేరస్థుడిని కూర్చోబెట్టి విధించే శిక్షను 1915-90 మధ్యకాలంలో అమలు చేశారు. 1990లో లెథల్‌ ఇంజక్షన్‌ ద్వారా మరణ శిక్షలను అమలు చేయడం ప్రారంభించారు. 1976 తర్వాతి కాలంలో పెండింగ్‌లో ఉన్న మూడు మరణ శిక్షలను 1995 తర్వాత కొత్త పద్ధతిలో అమలు చేశారు. ఇక్కడ మరణశిక్షలపై 2015 నుంచి మారటోరియం కొనసాగుతోంది. గవర్నర్‌ టామ్‌ వోల్ఫ్‌ ఈ మారటోరియంను విధించారు. దీంతో కోర్టులు మరణ శిక్షలు విధించినా.. నిందితులు అప్పీల్‌కు వెళ్లే అవకాశాలున్నాయి. ఆ మారటోరియాన్ని రద్దుచేస్తే తప్ప.. రఘునందన్‌కు విధించిన మరణ దండన అమలయ్యే అవకాశాలు లేవు. ఇక్కడ 1999లో చివరిసారి లెథల్‌ ఇంజక్షన్‌ ద్వారా మరణ శిక్షను అమలు చేశారు. అమెరికాలోని యాభై రాష్ట్రాల్లో 19 రాష్ట్రాలు మరణ శిక్షను పూర్తిగా రద్దుచేయగా.. మరో 19 రాష్ట్రాల్లో మారటోరియం కొనసాగుతోంది. మరణ శిక్ష అమల్లో ఉన్న మిగతా 12 రాష్ట్రాల్లో ఉరిశిక్ష, విద్యుత్‌ కుర్చీలు, గ్యాస్‌ ఛాంబర్లు, లెథల్‌ ఇంజక్షన్‌, ఇతర పద్ధతులను వినియోగిస్తున్నారు. ఉటా రాష్ట్రంలో నిందితులను తుపాకులతో కాల్చి చంపే సంస్కృతి ఉంది. 2015 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పద్ధతిని కొన్ని ప్రత్యేక సందర్భాలో మాత్రమే ఉపయోగిస్తారు.