:: Welcome to NRI - Article ::

34 ఏళ్ల తర్వాత కలుసుకున్న తండ్రికూతుళ్లు

టెక్సాస్: విధి ఆడిన నాటకంలో ఆమె కుటుంబసభ్యులంతా దూరమయ్యారు. మళ్లీ ఇన్నాళ్లకు టెక్నాలజీ సహయంతో ఒక్కటయ్యారు. తల్లిదండ్రులు విడిపోయిన పిల్లలు మానసికంగా ఎలాంటి బాధలు అనుభవిస్తారో తనకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియకపోవచ్చని అంగెలా బ్రానామ్(34) చెబుతోంది. ఆమె, తల్లిదండ్రులు 34 ఏళ్ల క్రితం విడిపోయారు. తన తండ్రి, చేసిన కొన్ని పనులు నచ్చకపోవడంతో, తల్లిదండ్రులిద్దరికీ మనస్సర్థలు వచ్చాయని దాంతో వారు విడిపోయారని ఆమె తెలిపింది. తనకు ఊహ కూడా తెలియని వయసులో తన తండ్రికి దూరమయ్యాడంది.

తండ్రి, జాన్‌డేనియల్(60), నుంచి విడిపోయిన తన తల్లి, అర్నెల్, తనను అమ్మమ్మగారింటికి తీసుకెళ్లిందని చెప్పింది. నార్త్ డకోటాలోని తన అమ్మమ్మ ఇంట్లోనే తాను పెరిగానంది. ఊహ తెలిసిన తర్వాత తన తండ్రి గురించి తెలుసుకోవాలనే కోరిక ఎక్కువైందని అయితే ఎవ్వరూ ఆయన పేరు కూడా చెప్పేవారు కాదంది. తన తండ్రి పేరు 13 ఏళ్ల వయసులో తనకు, తన అమ్మమ్మ చెప్పిందంటోంది.

తర్వాత 21 ఏళ్ల వయసులో తన తండ్రి ఫోటోను మొదటిసారి చూశానని చెప్పింది. అయితే ఆయన ఎక్కడున్నాడో తెలియదని తన తల్లి చెప్పేదని అంటోంది. తన తల్లి అర్నెల్ 2005లో మరణించిందని తెలిపింది. అంతకుముందే తన అమ్మమ్మ చనిపోవడంతో తనకు తోడు ఎవరూ లేకుండాపోయారంది. తన తండ్రి ఎక్కడున్నాడో తెలుసుకోవాలని ఫేస్‌బుక్‌లో తండ్రి పోటోలు పోస్టు చేసేదానినని తెలిపింది. తన ఆ ఫోటోను గుర్తించిన ఒక వ్యక్తి తనకు సంప్రదించడంతో తన తండ్రి జాడ తెలిసిందని తెలిపింది.

కార్పొస్ క్రీస్టీ అనే వ్యక్తి  తన తండ్రి స్నేహితుడే కావడంతో ఆయన ఆ ఫోటోను గుర్తుపట్టాడని చెప్పింది. దాంతో తన తండ్రిని కలుసుకోవడం చాలా సులభం అయిందని తెలిపింది. తన తల్లి దూరమైన తర్వాత తండ్రి డేనియల్ చాలా కష్టాలు అనుభవించాడని అతడు చెప్పాడంది. తన తల్లి కోసం అతడు ఎన్నో సార్లు 1700 కి.మీ,ల దూరంలో ఉన్న నార్త్ డకోటాకు వచ్చాడని కానీ, తన అమ్మమ్మ తనను, తన తల్లిని తన తండ్రికి చూపించకుండా చేసిందని అతడు తెలిపాడంది.

తన తండ్రి  ఎంతో మనోవేధన అనుభవించాడని, తాగుడు బానిసైపోయాడని క్రిస్టీ అన్నాడంది. ఈ మధ్యనే దాతల సహయంతో కాలేయమార్పిడి ఆపరేషన్ చేయించుకున్నాడని అతడు అంగెలాకు చెప్పాడు. దేవుడు తనను చూడకుండా చేయలేడని అందుకే దాతల రూపంలో తన తండ్రిని బతికించాడని తెలిపింది. ఫాదర్స్‌డే సందర్భంగా తన తండ్రిని కలుసుకోబోతున్నట్లు చెప్పింది.

తన తల్లి విమానంలో నార్త్ డకోటాకు బయలుదేరినప్పుడు తన వయసు 2సంవత్సరాలని,  అమ్మమ్మ చెప్పిందని అంగెలా చెబుతోంది. అప్పటి ఫోటోను తన తండ్రి ఇంకా తన కోటుజేబులో ఉంచుకున్నాడని కార్పొస్ క్రీస్టీ చెప్పాడంది. అది తనకు కన్నీళ్లు తెప్పించిదంటోంది. తన తండ్రికి తనపై ఉన్న ప్రేమను అది తెలియజేస్తోందని ఆమె అంటోంది. 

Loading...