cyclone-will-coming-soon-

తుఫాన్ విరుచుకుపడబోతుందని...

మియామి: వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు సంభవించే అవకాశం ఉందని మియామి వాతావరణ కేంద్రం తెలిపింది. అట్లాంటిక్ మహసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. సోమవారం నాటికి అది తుఫాన్ రూపంలో విరుచుకుపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఉత్తర కరోలినా తీరం మీదుగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. తీరం వైపు వెళ్లొద్దంటూ సాధారణ ప్రజలతోపాటు మత్స్యకారులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. తుఫాన్ వల్ల చాలా ప్రాంతాల్లో విపత్కర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.