couples-died-in-accident

కొడుకు అంత్యక్రియలు నిర్వహించి వస్తుండగా ఊహించని..

టెన్నీసి: కొడుకు మృతి చెందడంతో తల్లితండ్రి తల్లడిల్లారు. శోకసంద్రంలో మునిగారు. కన్నీటి వీడ్కోలు పలికారు. అంతలోనే ఆ దంపతులను కూడా మృత్యువు కబళించివేసింది... కొడుకు అంత్యక్రియలు నిర్వహించి వస్తున్న దంపతులను ఊహించని ప్రమాదం కబళించివేసింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. విషాదకరమైన ఈ ఘటన అమెరికాలోని టెన్నిసీ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదం శనివారం రాత్రి సమయంలో జరిగింది. కొడుకు అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత ఇంటికి తిరుగు ప్రయాణంలో భర్త కారు నడిపాడని, ఓ రాతి గోడను బలంగా ఢీకొట్టాడని, దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారని భావిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. మృతుల పేర్లు, ఇతర వివరాలను వెల్లడించలేదు.