:: Welcome to NRI - Article ::

కారులో చనిపోయిన పిల్లాడు తర్వాత ఏం జరిగిందంటే

ఫ్లోరిడా: రెండేళ్ల పిల్లాడు తప్పిపోయాడంటూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వారు చేసిన తప్పిదం ఆ పిల్లాడు ప్రాణాలు తీసిందనే విషయం వారికి తెలియకపోవడం గమనార్హం. సన్ సెంటినల్ అనే మీడియా సంస్థ వెల్లడించిన కథనం ప్రకారం డెల్‌రే బీచ్ ప్రాంతంలో కేడ్యాన్ సెయింట్(2), అనే బాలుడు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. వివరాలు సేకరించారు. నగరం మొత్తం గాలించారు. ఎక్కడ బాబు ఆచూకీ దొరకలేదు. పోలీసుల వల్ల కూడా పని కావడం లేదని బాబు తల్లిదండ్రులు డిటెక్టివ్స్‌కు కూడా కంప్లెయింట్ చేశారు.

వారు కూడా బాబు జాడ కనిపెట్టడంలో విఫలమయ్యారు. ఉదయం గం.11ల నుంచి కనిపించకుండాపోయిన ఆ కేడ్యాన్ కారులో ఉన్నాడన్న విషయాన్ని తల్లిదండ్రులు మరిచిపోయారు. అతడు ఎలా కారులోకి వెళ్లాడో కూడా వారికి అర్థం కాలేదు. అన్ని కంప్లైయిట్స్ ఫోన్‌లో చేయడం వల్ల కారు తీసుకుని బయటకు వెళ్లాల్సిన అవసరం వారికి రాలేదు. ఒక్కసారి తాను వెతుకుతానంటూ బాబు తండ్రి కారు బయటకు తీయబోయాడు. కారులో చూసేసరికి కేడ్యాన్ అపస్మారకస్థితిలో పడి ఉన్నాడు. దాంతో వెంటనే అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. కానీ, బాబు ప్రాణాలు మాత్రం నిలవలేదు. కొద్దిగంటలపాటు కారులో ఉండిపోవడంతో అతడి మెదడు ఆక్సిజన్ సరఫరా అందకపోవడం మరణించాడని డాక్టర్లు చెప్పారు. బాబు కారులో ఎవ్వరైన తీసుకెళ్లారా! లేదంటే తనకుతానే వెళ్లాడా అనే విషయాలు తెలియడం లేదని విచారణలో అన్ని బయటపడతాయని పోలీసులు చెప్పారు. 

Loading...