:: Welcome to NRI - Article ::

కన్నీరే మిగిలిందిక నేస్తం.. అంటూ గుక్కపట్టి ఏడుస్తోందీ పాప

ఓహియో: ఈ ఫోటో చూశారా... నిండా అయిదేళ్లు కూడా లేని ఈ పాప గుక్కపట్టి ఏడుస్తోంది. అమ్మో, నాన్నో కొట్టారనుకుంటే పొరపాటే. కిందపడి దెబ్బలు తగలడం వల్ల ఏడుస్తోందేమో అనుకుంటే గ్రహపాటే. తన స్నేహితుడు తప్పిపోయాడని, తెచ్చివ్వమని రోదిస్తోందీ పాప. ఇంతకీ ఆ స్నేహితుడు ఎవరో తెలుసా..? ఓ శునకం. ఓహియోకు చెందిన మాడిసన్ అనే చిన్నారి.. ఇంట్లో పెంచుకునే శునకంతో ఎంతగానో కలిసిపోయింది. ఉదయం లేచిన దగ్గర్నుంచి పడుకునే వరకూ దానితోనే ఆటాడుకుంటోంది. అయితే అనుకోకుండా ఆ శునకం తప్పిపోవడంతో ఎక్కడలేని దు:ఖం ముంచుకొచ్చింది. తన స్నేహితుడిని తెచ్చివ్వాలంటూ గుక్కపట్టి ఏడ్చింది. పాప ఏడుస్తుండగా వీడియో తీసిన తల్లి లూరా వాల్కెక్కా.. తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసింది. ఎవరికైనా ఈ శునకం కనిపిస్తే తెచ్చివ్వాలనీ, పాపకు సంతోషాన్ని కలిగించాలని కోరింది. 

వీడియో కోసం క్లిక్ చేయండి 

Loading...