car-s-trucked-in-mudslide--

బురదలో చిక్కుకున్న కారు..

కాలిఫోర్నియా: వరుస తుఫాన్‌లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం మరో సమస్య కాలిఫోర్నియా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని అధికారులు తెలిపారు. కాలిఫోర్నియా వ్యాప్తంగా ఎక్కడా చూసిన బురద ఉందని అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో కొండచరియాలు విరుచుకుపడి గ్రామాలు బురదలో కూరుకుపోయాయని వారు చెప్పారు. ఇప్పటివరకు 17మంది చనిపోయారన్నారు. మంగళవారం బార్‌బ్యాంక్ వీథిలో ఒక కారు బురద వల్ల కొట్టుకుపోయిందని అధికారులు తెలిపారు. ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.