Bronx-restaurant-runs-out-of-beef-patties,-angry-woman-smashes-its-windows-with-bat

రెస్టరెంట్‌లో బీఫ్ లేదని చెప్పడంతో..అమెరికాలో ఓ మహిళ బేస్‌బాల్ బ్యాట్ తీసుకుని..

క్లేర్‌మాంట్: బీఫ్ లేదని అమెరికాలోని ఓ రెస్టరెంట్‌పై మహిళ దాడిచేసింది. తాను అడిగిన బీఫ్ ఆ సమయంలో రెడీగా లేవని రెస్టరెంట్ వాళ్లు సమాధానమివ్వగా..కోపంతో ఊగిపోయిన మహిళ బేస్‌బాల్ బ్యాట్ తీసుకుని రెస్టరెంట్ అద్దాలను పగులకొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది. రెస్టరెంట్ యాజమాన్యం పోలీసులకు సమాచారమివ్వగా..అధికారులు మహిళ కోసం గాలిస్తున్నారు. రెస్టరెంట్‌లో పనిచేసేవారు మాత్రం ఆమె నిత్యం వస్తూనే ఉంటుందని..అందరితో బాగానే ఉంటుందని చెప్పారు. తన ప్రెగ్నెన్సీ గురించి కూడా తమతో చాలా సార్లు ప్రస్తావించిందని పేర్కొన్నారు. కోపంలో మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారో వారికే అర్థం కావడం లేదని పోలీసులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరికైనీ మహిళ సమాచారం తెలిస్తే 1-800-577-TIPS(8477)కు తెలియజేయగలరని పోలీసులు కోరారు. అంతేకాకుండా WWW.NYPDCRIMESTOPPERS.COM వెబ్‌సైట్‌లో లాగిన్ అయి లేదా క్రైమ్ స్టాపర్స్‌కు ఫోన్ చేసి..టిప్స్ కూడా ఇవ్వచ్చన్నారు. అమెరికాలో ఇంతకుముందు కూడా ఇలాంటి కేసులు ఎన్నో తలెత్తాయి. కాగా, మహిళ చేసిన వినాశనానికి తమకు రెండు వేల డాలర్లు(దాదాపు రూ.లక్షన్నర) ఖర్చవుతుందని రెస్టరెంట్ యజమానులు చెబుతున్నారు.