boy-teared-in-america

పాతరోజులు గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టిన బాలుడు

డెట్రాయిట్: కంటితడి పెట్టించే ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. డాయర్స్ అనే 8 ఏళ్ల బాలుడు చిన్నప్పటి నుంచి పేదరికంలో పెరిగాడు. అతడి తల్లి డియోన్నా ఓ నర్సుగా పనిచేసింది. ఆమె ఉద్యోగం ఊడిపోవడం, ఈ క్రమంలో సొంత ఇంటిని కోల్పోవడంతో రోడ్డునపడ్డారు. నిలువ నీడ కూడా లేకుండా పోయింది. ఇళ్లు లేకుండా ఇద్దరూ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. రాత్రివేళ్లలో ఎక్కడో ఒకచోట తలదాచుకుంటూ కాలం గడుపుతున్నారు. బాలుడిని ఏదోలా ఆమె రక్షిస్తూ వచ్చింది. సొంత ఇంటి కోసం దరఖాస్తు చేసుకోగా రాష్ట్రప్రభుత్వం ఇల్లు జారీ చేసింది. నిర్మించి ఇచ్చింది. కానీ ఇంట్లో సరైన సౌకర్యాలు ఏమీ లేవు. పడుకోవడానికి కనీసం మంచం కూడా లేదు. ఈ విషయం తెలుసుకున్న ‘హంబుల్ హోమ్’ అనే స్వచ్ఛంధ సేవా సంస్థ డాయర్స్ ఇంటిలో కావలసిన వస్తువులను కొనిచ్చింది. అందంగా అలంకరించి ఇచ్చింది. బాలుడు డాయర్స్ కోసం ప్రత్యేకంగా మంచాన్ని అలంకరించి ఇచ్చింది. చిన్నప్పటి నుంచి రోడ్ల పక్కన దాచుకున్న పాత రోజులను గుర్తుతెచ్చుకున్న డాయర్స్ మంచానని చూపించగానే కన్నీటిపర్యంతమయ్యాయి. ఏడుస్తూ కన్నతల్లిని కౌగిలించుకున్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన స్వచ్ఛంధ సేవా సంస్థ సభ్యులు బాలుడిని ఓదార్చారు. ఈ ఘటన అమెరికాలోని డెట్రాయిట్‌లో వెలుగులోకి వచ్చింది.