:: Welcome to NRI - Article ::

స్నేహితుల చేతిలో.. హత్యకు గురయిన బాలుడు

టెక్సాస్: పార్క్‌లో సరదాగా పిల్లలందరూ కలిసి ఆడిన ఆట ఆ విద్యార్థి ప్రాణాలు తీసింది. జువాన్‌బోర్జా(13), ఫ్రిపోర్టు ఇంటర్మీడియట్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. పెప్పర్‌మెంట్ పార్క్‌కు స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి బుధవారం వచ్చాడు. రష్యన్‌ రూల్లేట్ అనే గేమ్ ఆడుతున్నారు. ఆ గేమ్‌లో భాగంగా ఒక పిల్లాడు తుపాకీ తీసుకుని వచ్చాడు. ఆ తుపాకీ నిజమైన తుపాకీ అని పిల్లవాడికి తెలియలేదని దాంతో తుపాకీ పేల్చగానే గుండు, బోర్జా ఛాతీలో దిగిందని పోలీసులు తెలిపారు. వెంటనే బోర్జా అక్కడిక్కడే కుప్పకూలిపోయాడని పార్క్‌లో వాకింగ్ చేయడానికి వచ్చిన ఒక వ్యక్తి చెప్పాడు.

అయితే తాను మొదట తుపాకీ చప్పుళ్లు వినపడితే, ఎవరో క్రాకర్స్ కాలుస్తున్నారని భావించానని చెప్పాడు. తర్వాత కొద్దిసేపటికే కొంతదూరం వెళ్లి చూడగా, అక్కడ ఒక బాలుడు కిందపడి ఉన్నాడని అతడు తెలిపాడు. బాలుడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించానని కానీ, బాబు అప్పటికే మరణించడాని ఆయన అన్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశానన్నాడు. 

Loading...