:: Welcome to NRI - Article ::

పిల్లాడిని కిడ్నాప్ చేసిందెవరో తెలిసి పోలీసులు షాకయ్యారు

ఫ్లోరిడా: స్కూల్‌కెళ్లిన కొడుకు ఇంకా ఇంటికి రాలేదని ఆ తల్లి కంగారుపడుతోంది. ఆమె ఊహించిందే జరిగింది. ఆ పిల్లాడిని ఎవరో కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్లు ఆమెకు ఫోన్ చేసి బెదిరించడం మొదలుపెట్టారు. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగారు. స్కూల్ సీసీ టి.వి. ఫుటేజీలు పరిశీలించారు. అయినా ఫలితం లేకపోయింది. పిల్లాడిని గురువారం సాయంత్రమే కిడ్నాప్ చేశారని పోలీసులు చెబుతున్నారు.

కిడ్నాప్ చేసిన తరువాత ఫోన్ చేసి పిల్లాడి తల్లిని బెదిరించారు. మళ్లీ వారు శుక్రవారం ఉదయం ఫోన్ చేశారు. మరోసారి ఆమెను బెదిరించారు. అదంతా బాల్కకాస్ట్రో(57) అనే మహిళ చేస్తుందని పోలీసులు గ్రహించారు. పోలీసులు అన్ని రకాలుగా కిడ్నాపర్లను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ, ఎలాంటి ఫలితం లేకపోవడంతో పిల్లాడి తల్లి బంధువైన కాస్ట్రోపై నిఘా పెట్టారు. ఫోన్ చేసిన బెదిరించిన నంబరుకు కాస్ట్రో రెండు సార్లు ఫోన్ చేసి మాట్లాడిందని పోలీసులు గుర్తించారు. కిడ్నాపర్లకు ఆమెకు సంబంధం ఉందని నిర్ధారించుకుని ఆమెను ప్రశ్నించారు. దాంతో నిజం బయటపడిందని పోలీసులు తెలిపారు. చివరకు పిల్లాడి జాడ కనిపెట్టి, కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. పిల్లాడిని తల్లి డేనియల్ కాప్రియోకు అప్పగించామని జూపిటర్ కంట్రీ పోలీసులు తెలిపారు.