big-threat-sea-levels-rising-

సముద్ర మట్టం.. 3 మీటర్లు పెరగబోతుందని..

ఉత్తరకరోలినా: సముద్ర మట్టం 3 మీటర్ల పెరగబోతున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. అమెరికాలో సంభవించిన ఫ్లోరెన్స్ తుఫాన్ కారణంగా సముద్ర మట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తుఫాన్ కారణంగా ఇప్పటికే చాలా బీభత్సం జరిగిపోయిందని వారు అభిప్రాయపడ్డారు. చెట్లు, కరెంట్ స్తంబాలు నేలకొరిగాయన్నారు. గంటకు 90 మైళ్ల వేగంతో గాలులు వీస్తుండటంతో ఇలా జరిగిందని వారు తెలిపారు. దాదాపు లక్ష 50 వేల ఇళ్లకు కరెంట్ సరఫరా నిలిచిపోయిందన్నారు. సముద్ర మట్టం పెరిగే అవకాశం ఉండటంతో తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వెంటనే ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. న్యూబోర్న్ సీటిలో 159 మంది ప్రజలు వరద నీటిలో చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్ సభ్యులు రంగంలోకి దిగారని అధికారులు తెలిపారు.