being-left-in-hot-cars

లాక్ చేసిన కారులో దారుణం జరిగిపోయింది..

ఫ్లోరిడా: కారులో దారుణం జరిగిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం ఓ గ్యాస్ స్టేషన్ సమీపంలో నిలిపి ఉంచిన కారులో ఏడాది వయసున్న బాబు ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వెంటనే ఆ ప్రదేశానికి వెళ్లారు. అప్పటికీ బాబు కారులోనే ఉన్నాడు. పోలీసులు కారులో నుంచి బాబును బయటకు తీసుకొచ్చారు. అయితే అప్పటికే బాబు చనిపోయాడు. షాపింగ్ కోసం వెళ్లి తల్లి రావడం ఆలస్యం కావడంతో ఈ దారుణం జరిగిందని పోలీసులు తెలిపారు. స్టాన్‌ఫోర్డ్ కంట్రీలో శుక్రవారం మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు 70 డిగ్రీలుగా నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. అందువల్లే లాక్ చేసిన కారులో ఉన్న బాబు చనిపోయాడన్నారు. బిడ్డ పట్ల నిర్లక్ష్యం వహించిన తల్లిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హజరుపరిచారు.