bats-in-america-

షాపింగ్‌మాల్‌లో గబ్బిలాలు..

టెక్సాస్: ప్రముఖ షాపింగ్‌మాల్‌లో గబ్బిలాలు సంచరిస్తున్నాయి. అవి సంచరిస్తుండగా కొంతమంది వినియోగదారులు వీడియో తీశారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టుచేశారు. గబ్బిలాలు సంచరిస్తున్నాయని తెలియడంతో కొంతమంది ఆ షాపింగ్ మాల్‌కు వెళ్లేందుకు కూడా ఇష్టపడటం లేదు. దాంతో సేల్స్ కూడా తగ్గిపోయాయని షాపింగ్ మాల్ మేనేజర్ చెబుతున్నాడు. ఎన్నిసార్లు వాటిని బయటకు వెళ్లగొట్టిన అవి వస్తూనే ఉన్నాయని అతడు చెప్పాడు. ఎక్కువగా మాంసాహరం ఉండే ప్రదేశాల్లోనే గబ్బిలాలు ఉంటున్నాయని దాంతో ఎవ్వరూ ఆ పదార్థాలు కొనేందుకు ఇష్టపడటం లేదన్నాడు. మరోవైపు ఆరోగ్య శాఖ తమ షాపింగ్ మాల్‌లో గబ్బిలాలు సంచరిస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోందన్నాడు. అయితే ప్రముఖ సంస్థ అయిన వాల్‌మార్ట్‌లోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని వినియోగదారులు వాపోతున్నారు.