:: Welcome to NRI - Article ::

ఫ్లోరిడాకు మరో తుఫాన్.. ముప్పు

ఫ్లోరిడా: హరికేన్ మారియా రోజురోజుకి విధ్వంసం సృష్టించే దిశగా తరలిపోతుందని అమెరికా జాతీయ తుఫాన్ కేంద్రం ప్రకటించింది. సముద్రంలో అలలు అతి వేగంగా వస్తున్నాయని అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మారియా తుఫాన్ వల్ల 110 మైళ్ల వేగంతో గాలులు వీస్తున్నాయని చెప్పారు.

ఫ్లోరిడాకు ఉత్తరంగా మారియా కదులుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. కారోలినా, మధ్య అట్లాంటిక్ తీరం వెంబడి మారియా విస్తరిస్తోంది. ఫ్లోరిడా ప్రజలకు మరోసారి ఇళ్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తోందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అత్యవసర విభాగాల సహయం తీసుకోవాలని అధికారులు సూచించారు. వరదల్లో చిక్కుకుంటే వెంటనే ఆ సమాచారం అధికారులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.