animal-appeared-in-rare-case-

అరుదైన జంతువు కనిపించిందని..

న్యూయార్క్: వన్యప్రాణులు అడవులు క్రమంగా అంతరించిపోతుండటంతో జనవాసాల్లోకి వస్తున్నాయి. ఈ పరిస్థితి మనదేశంలోనే కాదు. అమెరికాలో కూడా కనిపిస్తోంది.  అయితే ఈ మధ్య అర్దరాత్రి ఒక వ్యక్తి తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. న్యూయార్క్‌లోని క్లార్ట్‌టౌన్ అనే ప్రాంతంలో ఆయన ఆ ఫోటోలను తీశాడు. కాయోట్ వుల్ఫ్(తోడేలు) అనే తోడేలు జనవాసాల్లోకి వచ్చినప్పుడు ఆయన దాన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ ఫోటోలు వైరల్ మారాయి. కాయోట్ తోడేలు చాలా అరుదుగా కనిపిస్తుందని అధికారులు చెప్పారు. జనవాసాల్లో అలాంటి జంతువు కనిపించడం వింతగా అనిపిస్తోందని వారు అంటున్నారు.