:: Welcome to NRI - Article ::

అమెరికాలో.. 4 లక్షల ఇళ్లల్లో కరెంట్ లేదు

 ఫ్లోరిడా: ప్రకృతి ప్రకోపానికి ఏ దేశమైన తలవంచాల్సి వస్తుంది. అమెరికా అందుకు మినహయింపేమి కాదు.  ఫ్లోరిడా, టెక్సాస్ రాష్ట్రాల్లో ఇర్మా తుఫాన్ విరుచుకుపడుతోంది. ఆదివారం ఉదయం నుంచి రెండు రాష్ట్రాల్లో నాలుగు లక్షల తోంభై వేల ఇళ్లల్లో కరెంటు లేకుండాపోయింది. ఉదయం గం.7ల నుంచే గంటకి 130 కి.మీ.ల వేగంతో బలమైన గాలులు విస్తున్నాయి. దాంతో ప్రభుత్వం కొంతమందిని ఇళ్లల్లో నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించింది. గాలులు బలంగా వీస్తున్న ప్రాంతాల్లో ప్రజలను ఇళ్లల్లో నుంచి బయటకు రావద్దని అధికారులు పిలుపునిచ్చారు. దక్షిణ ఫ్లోరిడా బీచ్‌లో దాదాపు 15 అడుగుల ఎత్తులో అలలు ఎగసిపడుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రజలు బీచ్ వైపు వెళ్లోద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.