:: Welcome to NRI - Article ::

డాలీ సిటీకి వచ్చిన భారీ తిమింగల మృతదేహం

కాలిఫోర్నియా: ఉత్తర కాలిఫోర్నియాలోని డాలీ సిటీలో తీరానికి కొట్టుకొచ్చిన బ్లూ వేల్‌ పుర్రె అనేక చోట్ల చిట్లిపోయింది. మెరైన్ మమ్మల్ సెంటర్‌లోని కాలిఫోర్నియా అకాడమీ ఆఫ్ సైన్సెస్, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల బృందం దీనిని పరిశీలించింది. ఈ మగ వేల్ పొడవు 65 అడుగులు ఉంది. ఇది తీరానికి కొట్టుకొచ్చే ముందు తీవ్రంగా దెబ్బతిందని పేర్కొన్నారు. ఇది మరణించడానికి కారణాలను తెలుసుకునేందుకు ఈ బృందం ప్రయత్నిస్తోంది.డాలీ సిటీలోని థోర్న్‌టౌన్ స్టేట్ బీచ్‌లోకి భారీ తిమింగలం వచ్చిందని సమాచారం అందడంతో మెరైన్ మమ్మల్ సెంటర్ వెంటనే స్పందించింది. గత నలభయ్యేళ్ళలో ఈ విధంగా వచ్చిన తిమింగలాల్లో ఇది ఏడోది. ప్రపంచంలో అతి పెడవైన జంతువులు బ్లూవేల్స్. బాస్కెట్ బాల్ కోర్టు కన్నా ఎక్కువ పొడవుగా పెరుగుతాయి. 15 స్కూలు బస్సుల కన్నా ఎక్కువ బరువు ఉంటుంది.