86-years-old-wife-kills-husband-arrested

89 ఏళ్ల భర్తను హత్య చేసిన భార్య అరెస్ట్

 ఫ్లోరిడా, యూఎస్ఏ: అమెరికాలోని ఫ్లోరిడాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 86 ఏళ్ల వయసున్న రమొన లుండ్ అనే వృద్ధ మహిళ తన భర్త 89 ఏళ్ల ఫ్రాన్సిస్ లుండ్‌ను హత్య చేసింది. ఇంటి ఆవరణలో రక్తపు మడుగులో పడివున్న ఫ్రాన్సిస్ లుండ్‌ను గమనించిన పక్కింటి వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భార్యే భర్తను హత్య చేసిందని తేల్చారు. హత్య చేసిన మహిళ దుస్తులతోపాటు ఇంట్లోని అనేకచోట్ల రక్తపు మరకలు కనిపించాయని, ఫ్రాన్సిస్ ఉపయోగించే చేతి కర్ర విరగ్గొట్టి ఉందని పోలీసులు వెల్లడించారు. అయితే హత్యకు దారితీసిన కారణాలను మాత్రం పోలీసులు వెల్లడించలేదు. నిందితురాలను అరెస్ట్ చేశామని, కోర్టులో విచారణ జరగనుందని పోలీసులు వెల్లడించారు.