:: Welcome to NRI - Article ::

న్యూయార్క్ వ్యక్తికి 66 కోట్ల రూపాయల నష్ట పరిహారం

న్యూయార్క్ సిటీ :  సబ్‌వే ప్లాట్‌ఫారం ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న మైఖేల్ డియోన్‌కు కోటి డాలర్ల (66 కోట్ల 79 వేల రూపాయలు) పరిహారాన్ని ప్రకటిస్తూ మన్‌హటన్ కోర్టు తీర్పు చెప్పింది.  2010లో జరిగిన ఈ ప్రమాదంలో మన్‌హటన్‌లోని యూనియన్ స్క్వేర్ రైల్వే స్టేషన్‌లో కదులుతున్నసబ్‌వే ప్లాట్‌ఫారానికి, నెం.4 రైలుకు మధ్యలో మైఖేల్ చిక్కుకుపోయాడు. 

 
ఈ ప్రమాదానికి ముందు అంతకుముందు మైఖేల్ ఓ ఛారిటీ ఈవెంట్‌లో పాల్గొన్నాడు . అక్కడి నుంచి 4 డ్రింక్‌లు తెచ్చుకున్నాడు. చెవుల్లో ఇయర్ ఫోన్లు పెట్టుకుని, నడుస్తుండగా నెంబర్ 4 ట్రైన్‌కు, ప్లాట్ ఫారానికి మధ్య నలిగిపోయాడు. చేతిలో బడ్‌వీజర్ క్యాన్‌‌ ఉంది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడాని చాలా ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకపోయింది. 
 
తనకు 15 మిలియన్ డాలర్లు నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ మైఖేల్ వ్యాజ్యం దాఖలు చేశాడు. మైఖేల్ నిర్లక్ష్యం కూడా ఈ  ప్రమాదానికి ఒక కారణమని జ్యూరీ తెలిపింది. అతనికి ఆరు శస్త్ర చికిత్సలు జరిగాయని, పెద్ద ప్రేగులను పాక్షికంగా తొలగగించారని మైఖేల్ తరపు న్యాయవాది చెప్పారు. మైఖేల్ గాయపడటంలో అతని నిర్లక్ష్యం పాత్రకు ప్రాధాన్యం ఇవ్వలేదని జ్యూరీలోని ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు చెప్పారు.  మైఖేల్‌కు 10 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని జ్యూరీ ఆదేశించింది. దీనిపై అపీలు చేస్తామని ఎంటీఏ అధికార ప్రతినిధి తెలిపారు.