5-life-sentences-for-a-murder-convicted-youth

తల్లితండ్రి, తోబుట్టువులను హత్య చేసిన అన్నతమ్ముళ్లు

ఓక్లహామా, యూఎస్ఏ: సమాజంపై విద్వేషం, సమాజంలోని ప్రతీ ఒక్కరిపై ఉన్న కోపంతో ఇద్దరు అన్నదమ్ముళ్లు దారుణానికి ఒడిగట్టారు. జన్మనిచ్చిన అమ్మానాన్నలతోపాటు ముగ్గురు తోబుట్టువులను కిరాతకంగా హత్య చేశారు. ఇద్దరూ కలిసి ఇంట్లోనే అందర్నీ కత్తితో పొడిచి చంపేశారు. అమెరికాలోని ఓక్లహామాకు చెందిన మైకేల్ బెవర్(ప్రస్తుతం 19 ఏళ్లు), అతడి అన్నయ్య రాబర్ట్ ఈ ఘోరానికి పాల్పడ్డారు. మృతుల్లో ఐదేళ్ల బాలిక కూడా ఉండడం పలువురిని కలచివేసింది. అయితే 2015లో జరిగిన ఈ దుర్ఘటనపై న్యాయస్థానం విచారణను పూర్తి చేసింది. ప్రధాన దోషిగా తేలడంతో బెవర్‌కు 5 జీవితకాల శిక్షలు విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. 85 శాతం శిక్ష పూర్తైన తర్వాత మాత్రమే ఖైదీకి పెరోల్ ఇవ్వాలని ఆదేశించింది. అంటే దాదాపు 215 సంవత్సరాల శిక్ష తర్వాత మాత్రమే దోషి బెవర్ పెరోల్ పొందనున్నాడు. ఇదిలావుండగా ఇదే కేసులో గతేడాది దోషిగా తేలిన బెవర్ అన్న రాబర్ట్‌కు జీవిత జైలుశిక్షపడడంతో అతడు జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇదిలావుండగా దారుణమూన ఈ దాడిలో 2, 13 ఏళ్ల వయసున్న బాలికలు ప్రాణాలతో బయటపడ్డారు. 13 ఏళ్ల బాలికకు తీవ్రమైన గాయాలవ్వగా చికిత్స అనంతరం కోలుకుందని పోలీసులు తెలిపారు.