3-years-old-girl-died-with-flu

మూడేళ్ల చిన్నారి మృతి..పోస్టుమార్టంలో..

ఇండియానా: తోటి పిల్లలతో చక్కగా ఆడుకునే మూడేళ్ల చిన్నారి విషాదకరంగా కన్నుమూసింది. అమెరికన్లను వణికిస్తున్న ఫ్లూ చిన్నారి మృతికి కారణమైంది. ఫ్లూ, నిమోనియా కారణంగా చిన్నారి మృతిచెందిందని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. నీరసిస్తున్న చిన్నారి మూడేళ్ల అలివియా విల్లిక్స్‌ను హాస్పిటల్లో చేర్పించారు. ఫ్లూ అని నిర్ధారించిన వైద్యులు చికిత్స అందించారు. చిన్నారి కోలుకుంటుండడంతో ఇంటికి పంపించారు. కానీ సంతోషంలో ఉన్న ఆ కుటుంబాన్ని విషాదం వెంటాడింది. ఇంటికి తీసుకెళ్లిన మూడు రోజుల తర్వాత చిన్నారి ఇంట్లోనే మృతిచెందింది. ఈ దుర్ఘటనతో చిన్నారి కుటుంబం తీవ్రవిషాదానికి గురైంది. ఈ విషయాన్ని చిన్నారి తల్లితండ్రులు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. చిన్నారి మృతపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఇదిలావుండగా  అమెరికాలో ఫ్లూ మృతుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అనేకమంది చిన్నారులు ఇప్పటికే మృత్యువాత పడ్డారని, విపరీతమైన శీతల వాతావరణమే ఫ్లూ వ్యాప్తికి కారణమని, తగుజాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు వెల్లడించారు.