:: Welcome to NRI - Article ::

భారతీయుడిపై దాడికి పాల్పడ్డ వ్యక్తులకు జైలుశిక్ష

టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్ నగరంలో గతేడాది సెప్టెంబర్ 25న భారతీయుడిపై దాడికి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులను జైలుకు తరలించారు. మాన్ సింగ్ ఖల్సా అనే భారతీయుడిపై ఇద్దరు వ్యక్తులు జాతి విధ్వేష దాడికి పాల్పడ్డారు. మాన్ సింగ్ అనే సిక్కు వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. కత్తితో జుట్టుని కొంచెం కోశారు. విచక్షిణారహితంగా కొట్టడంతో మాన్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. దాడికి పాల్పడ్డ చాసే లిటిల్ (31), లెబ్లాన్(25) ఇద్దరూ కలిసి ఈ నేరానికి పాల్పడ్డారని రుజువుకావడంతో ఒక్కొక్కరికీ 3 సంవత్సరాల జైలుశిక్ష విధించారు. గురువారం దోషులను జైలుకి పంపించారు.