17.5-foot-python

17.5 అడుగుల పైథాన్‌ను పట్టుకున్నాడు

ఫ్లోరిడా: భయంకరమైన విషసర్పాలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పాములు ఎక్కడైన కనిపిస్తే వాటిని చంపొద్దని వెంటనే స్నేక్ క్యాచర్స్ టీమ్ సభ్యులకు సమాచారం అందించాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. ఈ యేడాది మొదటి ఆరు నెలల్లోనే స్నేక్ క్యాచర్స్ టీమ్ సభ్యులు ఏకంగా రెండు వేల పాములను పట్టుకున్నారని వారు గుర్తు చేస్తున్నారు. పాములను పట్టుకునే వారికి మంచి ఉపాధి లభిస్తోందని అధికారులు చెబుతున్నారు. పాములు పట్టుకునే స్నేక్ క్యాచర్స్ టీమ్ సభ్యులు గంటకు ఎనిమిది డాలర్లు(రూ.580) వసూలు చేస్తున్నారన్నారు. అలాగే పాముల సైజును బట్టి ఎక్కువ మొత్తంలో కూడా వసూలు చేసే అవకాశం ఉందని వారు తెలిపారు. పాముల గూళ్లను వాటి పిల్లలను కూడా పట్టుకుంటే ఏకంగా రెండు వందల డాలర్లు(రూ.15,000) వసూలు చేస్తున్నారు. అయితే ఇటీవల పెస్టన్ అనే స్నేక్ క్యాచర్ టీమ్ సభ్యుడు 17.5 అడుగుల పొడవున్న పైథాన్‌ను పట్టుకుని రికార్డు క్రియేట్ చేశాడు. ఇప్పటివరకు అంత పెద్ద పైథాన్‌ను ఎవ్వరూ పట్టుకోలేకపోయారని అధికారులు తెలిపారు. తాను ఇప్పటికే 235 పాములను పట్టుకున్నానని పెస్టన్ చెబుతున్నాడు. అయితే ఇంత పెద్ద పామును పట్టుకోవడం ఇదే మొదటిసారని అతడు తెలిపాడు.