-surf-as-a-form-of-therapy

సముద్రంలో అలలు విరుచుకుపడుతున్నా..

కాలిఫోర్నియా: సముద్రంలో అలలు విరుచుకుపడుతున్నాయి. అయినా బోటు అంచున ఏ మాత్రం భయం లేకుండా ఓ పెంపుడుకుక్క నిలబడి ఉంది. అలలు దాన్ని తాకుతూ వెళ్తున్నాయి. కొన్నిసార్లు అలల తాకిడికి కుక్క కిందపడిపోయింది. కానీ, అలల తాకిడిని అది లెక్క చేయడం లేదు. మళ్లీ బోటు ఎక్కి అంచున నిలబడుతోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన పెంపుడు కుక్క చేసిన ఈ సాహసాన్ని యజమాని వీడియో తీశాడు. పెంపుడు కుక్క కోసమే ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ క్రియేట్ చేశాడు. అందులో తన పెంపుడు కుక్క చేసే సాహసాలను పోస్టు చేస్తున్నాడు.

ఇప్పటికే 75 వేల మంది ఆ అకౌంట్‌ను ఫాలో అవుతున్నారు. ఆ వీడియోలను భారీ సంఖ్యలో షేర్ చేస్తున్నారు. అయితే తన పెంపుడుకుక్క అలా చేయడం వెనుక పెద్ద కథ ఉందని దాని యజమాని చెబుతున్నాడు. 2014లో రెండు కుక్కలు తన పెంపుడు కుక్కపై దాడి చేశాయని యజమాని తెలిపాడు. ఆ దాడిలో తన పెంపుడు కుక్కకు తీవ్ర గాయాలు అయ్యాయన్నాడు. మళ్లీ కుక్క కోలుకోవాలంటే హైడ్రో థెరపీ అవసరమని డాక్టర్లు సూచించారన్నాడు. అందువల్ల వారానికొకసారి సముద్రంలో సర్ఫింగ్‌కు తీసుకెళ్తున్నానని అతడు చెబుతున్నాడు. దాంతో తన పెంపుడు కుక్క త్వరగానే కోలుకుందని అతడు ఆనందంతో తెలిపాడు.